Jasprit Bumra: బుమ్రా సైలెంట్ పోస్ట్.. అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ!

Jasprit bumras cryptic post stirs up internet

  • కొన్ని సమయాల్లో మౌనమే సరైన సమాధానమంటూ జస్‌ప్రీత్ బుమ్రా పోస్ట్
  • ఈ వ్యాఖ్యలకు కారణం అర్థంకాక నెట్టింట చర్చ
  • పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి రావడంపై బుమ్రా స్పందన ఇదేనంటూ కొందరి కామెంట్

టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇన్‌స్టాలో తాజాగా షేర్ చేసిన పోస్టు పెద్ద చర్చకు దారితీసింది. ఐపీఎల్ రిటెన్షన్‌ నడుమ అతడి పోస్టు సంచలనంగా మారింది. ‘‘కొన్ని సందర్భాల్లో మౌనమే సరైన సమాధానమవుతుంది’’ అంటూ బుమ్రా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. 

ఈ పోస్ట్‌పై అభిమానులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగొచ్చిన నేపథ్యంలోనే బుమ్రా ఈ పోస్ట్ పెట్టినట్టు చెబుతున్నారు. రోహిత్ శర్మ తన కెరీర్ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో ఫ్రాంచైజీ కప్టెన్సీ బాధ్యతలు బుమ్రా చేతుల్లోకి వెళతాయని అనేక మంది భావించారు. అయితే, అకస్మాత్తుగా గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్య ముంబై ఇండియ్స్‌లో చేరడంతో బుమ్రా ప్లాన్లు దారితప్పాయన్న కామెంట్ చేస్తున్నారు.  

బుమ్రా విజయవంతమైన బౌలర్ అయినప్పటికీ ఇంతవరకూ అతడికి కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు తీసుకున్న అనుభవం లేదు. ఆ నేపథ్యంలో రోహిత్ శర్మ బాధ్యతలను ఆల్ రౌండర్ పాండ్యాకు బదిలీ చేసేందుకు ప్రాంఛైజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Jasprit Bumra
Gujarat Titans
Mumbai Indians
Hardik Pandya
  • Loading...

More Telugu News