Narendra Modi: తెలంగాణలో ముగిసిన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

PM Modi road show in Hyderabad

  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన రోడ్డు షో
  • మోదీ వెంట కిషన్ రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్
  • కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ

తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ రోజు సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షో అనంతరం కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. రోడ్డు షోతో మోదీ ఎన్నికల ప్రచారం ముగియడంతో నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Narendra Modi
BJP
Telangana Assembly Election
  • Loading...

More Telugu News