Nara Brahmani: నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను: లోకేశ్ ను ఉద్దేశించి నారా బ్రాహ్మణి ట్వీట్

Nara Brahmani tweets on Lokesh

  • జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ యువగళం 
  • చంద్రబాబు అరెస్ట్ తో సెప్టెంబరు 9న నిలిచిన పాదయాత్ర
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
  • మళ్లీ 79 రోజుల విరామం తర్వాత యువగళం పునఃప్రారంభం
  • రాజోలు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రకు విశేష స్పందన
  • ఫొటోలు పంచుకున్న నారా బ్రాహ్మణి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టారు. నేడు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి యువగళం పునఃప్రారంభమైంది. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు విశేషంగా తరలివచ్చాయి. తాటిపాక సభకు భారీ స్పందన లభించింది. 

దీనిపై లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి స్పందించారు. నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను అంటూ బ్రాహ్మణి ట్వీట్ చేశారు. అంతేకాదు, లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం దృశ్యాలను ఫొటోల రూపంలో పంచుకున్నారు. 

స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో నారా లోకేశ్ తన పాదయాత్రను మళ్లీ పట్టాలెక్కించారు. జనవరి 27న ప్రారంభమైన యువగళం సెప్టెంబరు 9న నిలిచిపోయింది. చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. మళ్లీ 79 రోజుల విరామం తర్వాత పాదయాత్ర మొదలైంది.

More Telugu News