Tractor: ట్రాక్టర్ తో పాటు బావిలో పడిన మూడేళ్ల బాబు.. క్షేమంగా బయటపడ్డ బాలుడు.. వీడియో ఇదిగో!

Tractor Fell Into 30 Feet Well Including Child

  • మధ్యప్రదేశ్ లోని శివపురిలో మిరాకిల్
  • ఘటనలో నుజునుజ్జుగా మారిన ట్రాక్టర్
  • బాబు ఒంటిపై చిన్న గీత కూడా పడకపోవడం నిజంగా అద్భుతమే అంటున్న స్థానికులు

మధ్యప్రదేశ్ లోని శివపురి సమీపంలోని లంగూరి గ్రామంలో ఓ ఆశ్చర్యకరమైన.. అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ బలరాం పాల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవాబ్ జాతవ్ తమ ట్రాక్టర్ ను ఇంటికి సమీపంలో పార్క్ చేశాడు. నవాబ్ ఇద్దరు పిల్లలు మూడేళ్ల అన్షుల్, సుహాని ట్రాక్టర్ పైకెక్కి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో గేర్ రాడ్ మార్చడంతో ట్రాక్టర్ కదిలింది. ఇది గమనించి నవాబ్ పరుగెత్తుకెళ్లి సుహానిని కాపాడాడు. అన్షుల్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగానే ట్రాక్టర్ వెళ్లి దగ్గర్లోని నీళ్లు లేని బావిలో పడింది.

దాదాపు 30 అడుగుల లోతున్న ఆ బావిలో ట్రాలీతో సహా పడిపోయింది. అన్షుల్ కూడా ట్రాక్టర్ తో పాటే పడిపోయాడు. ట్రాక్టర్ నుజ్జునుజ్జుగా మారడంతో అన్షుల్ ప్రాణాలతో ఉండే అవకాశంలేదని నవాబ్ భావించాడు. తాళ్లతో బావిలోకి దిగి చూడగా.. అన్షుల్ క్షేమంగా ఉండడం కనిపించింది. పైకి తీసుకొచ్చి ఒళ్లంతా పరీక్షించి చూసినా ఎక్కడా చిన్న గీత కూడా పడలేదని గుర్తించారు. బావిలో పడిన ట్రాక్టర్ ను దాని పరిస్థితిని చూసిన వాళ్లు అన్షుల్ క్షేమంగా బయటపడడం నిజంగా అద్భుతమేనని అంటున్నారు.


Tractor
fell in well
kid safe
miracle
Madhya Pradesh
offbeat

More Telugu News