Shubman Gill: ముంబైకి వెళ్లిపోయిన పాండ్యా.. శుభ్‌మన్ గిల్‌కు భలే చాన్స్!

Shubman Gill To Lead Gujarat Titans In IPL 2024
  • క్యాష్ డీల్‌లో భాగంగా పాండ్యాను దక్కించుకున్న ముంబై ఇండియన్స్
  • శుభమన్ గిల్‌కు పగ్గాలు అందించే యోచనలో గుజరాత్ ఫ్రాంచైజీ
  • వార్తలపై స్పందించని టైటాన్స్ జట్టు
ఐపీఎల్‌లో రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు స్కిప్పర్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా ఓసారి ట్రోఫీ కూడా అందించిపెట్టాడు. ఆదివారం నాటి ట్రేడింగ్‌లో పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. కెప్టెన్ వెళ్లిపోవడంతో ఆ జట్టును నడిపించేదెవరన్న దానిపై సస్పెన్స్ దాదాపు వీడింది. టీమిండియా బ్యాటర్ శుభమన్ గిల్ గుజరాత్‌కు స్కిప్పర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

నిజానికి గుజరాత్ రిటెన్షన్ జాబితాలో హార్దిక్ పేరు ఉన్నప్పటికీ అనూహ్యంగా నగదు ఒప్పందంలో భాగంగా పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్ చేపట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అటు ఫ్రాంచైజీ నుంచి కానీ, ఇటు గిల్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
Shubman Gill
Hardik Pandya
IPL 2024

More Telugu News