Yogi Adityanath: బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుంది: యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath Election campaign in Hyderabad

  • బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని వ్యాఖ్య
  • తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన
  • డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య

తెలంగాణలో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని... ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ రోడ్డు షోలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి తెలగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే... నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనను గాలికి వదిలేశారని, కుటుంబ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.

Yogi Adityanath
Telangana Assembly Election
BJP
  • Loading...

More Telugu News