KCR: ఆ పేరే నాకు ఆకాశమంత... అంతకుమించి ఏ పదవి అవసరం లేదు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR interesting comments in Jagityal Meeting

  • తెలంగాణ తీసుకువచ్చానన్న పేరే తనకు చాలన్న కేసీఆర్
  • పదేళ్ళు సీఎంగా ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు లేరని, ఆ ఘనత తనకు దక్కిందని వ్యాఖ్య
  • జీవితంలో ఏదో కావాలనే కోరిక తనకు లేదన్న ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నాడు జగిత్యాల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చినందుకు లభించిన పేరే తనకు ఆకాశమంత అని... ఆ పేరు చాలని, అంతకుమించిన పదవి ఏదీ లేదన్నారు. తాను ప్రజల మద్దతుతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని, తెలుగు రాష్ట్రాలలో వరుసగా పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు ఎవరూ లేరని, ఆ గొప్పదనం తనకు దక్కిందన్నారు. జీవితంలో ఇంకా ఏదో కావాలనే కోరికలు తనకు లేవన్నారు. తన పోరాటం పదవుల కోసం కాదని వ్యాఖ్యానించారు.

తాను కొట్లాడేది తన పదవి కోసం కాదన్నారు. వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలనేది తన లక్ష్యం అన్నారు. కేరళ రాష్ట్రం మాదిరి వందశాతం అక్షరాస్యత... ప్రతి రైతు గుండెమీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయే విధంగా దిగుబడి, ప్రతి ఇంటికి నీళ్లు... వీటి కోసమే తన పోరాటం అన్నారు. తనకు 70 ఏళ్ళు వచ్చాయని, ఇంకా ఈ జీవితంలో ఏం కావాలన్నారు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే... పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమై ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

KCR
Telangana Assembly Election
Congress
BRS
  • Loading...

More Telugu News