barrelakka shirisha: బర్రెలక్క శిరీష ధైర్యంగా ముందుకు సాగుతోంది... మనందరికీ ఆదర్శం: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI former JD Laxminarayana on Barrelakka

  • మూస రాజకీయాల నుంచి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరముందని వ్యాఖ్య
  • గెలిచి... ప్రజల కష్టాలను, తన కష్టాలను అసెంబ్లీలో వినిపిస్తానని బర్రెలక్క చెబుతోందన్న లక్ష్మీనారాయణ
  • బాధ్యత కలిగిన పౌరుడిగా ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి

బర్రెలక్క కర్నె శిరీష ఎన్నికల్లో నిలబడి ధైర్యంగా ముందుకు సాగుతోందని... ఆమె మనందరికీ ఆదర్శమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మూస రాజకీయాల నుంచి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరముందన్నారు. మంగళగిరిలోని వీజే డిగ్రీ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి వస్తే తాను ప్రోత్సహిస్తుంటానని, తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బరిలో ఉన్న బర్రెలక్క కర్నె శిరీషకు కూడా తాను మద్దతు తెలుపుతున్నానని వివరించారు.

ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. తాను గెలిచి.. తన కష్టాలను, ప్రజాసమస్యలను కచ్చితంగా అసెంబ్లీలో వినిపిస్తానని ఆమె చెబుతోందని, అలాంటప్పుడు బాధ్యత కలిగిన పౌరుడిగా ఆమె వెనుక నిలబడాలనే ఉద్దేశ్యంతో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

శిరీషను తాను నిన్న కలిసి ధైర్యాన్ని... భరోసాను ఇచ్చి ప్రోత్సహించానన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు. నాయకులు వారే ఉంటున్నారు, పార్టీలు అవే ఉంటున్నాయి.. దాంతో కొత్తవారు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. కాబట్టి యువతరాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని తాను ఎప్పుడు చెబుతుంటానని వివరించారు. యువతరం నిర్ణయించుకుంటే భారత భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో తానూ పోటీ చేస్తానన్నారు.

barrelakka shirisha
Telangana Assembly Election
jd laxminarayana
  • Loading...

More Telugu News