KTR: మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

Election Commission issues notices to minister ktr

  • టీ వర్క్స్‌ను రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత సూర్జేవాలా ఫిర్యాదు
  • ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని కేటీఆర్ ఉల్లంఘించినట్లు అభిప్రాయపడిన ఈసీ
  • రేపు మధ్యాహ్నం మూడు గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు

మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌ కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులలో పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీ వర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని, అలాగే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని, తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. రేపు మధ్యాహ్నం మూడు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News