Nani: నాని 'హాయ్ నాన్న' చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్

Nani Hi Nanna movie trailer out now

  • నాని, బేబీ కియారా ప్రధాన పాత్రల్లో హాయ్ నాన్న చిత్రం
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న శౌర్యువ్
  • హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ 

తండ్రి, కుమార్తె మధ్య భావోద్వేగాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'హాయ్ నాన్న'. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, బేబీ కియారా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా 'హాయ్ నాన్న' చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. తండ్రి, కుమార్తె మధ్య అనుబంధం గతంలో అనేక చిత్రాల్లో చూపించినప్పటికీ, 'హాయ్ నాన్న' చిత్ర  కథనం కొత్తగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 

ఇప్పటికే ఈ సినిమా అప్ డేట్లకు సినీ ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. ట్రైలర్ కూడా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల నిర్మాతలు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News