Surya: హీరో సూర్యకు ప్రమాదం.. వైద్యులు ఏం చెప్పారంటే..!

Doctors report on actor Surya injury

  • 'కంగువా' సినిమా షూటింగ్ లో సూర్యకు ప్రమాదం
  • సూర్య భుజంపై పడిన భారీ కెమెరా
  • విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్న డాక్టర్లు

ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం 'కంగువా' సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సూర్యపై కెమెరా పడింది. ఈ ప్రమాదంలో సూర్య భుజానికి గాయమయింది. సూర్య గాయపడిన విషయాన్ని సూర్య పీఆర్ కూడా ధ్రువీకరించారు. షూటింగ్ లో సూర్య గాయపడిన విషయం నిజమేనని, అయితే అది అంత పెద్ద గాయం కాదనే సమాచారం నిర్మాతల నుంచి వచ్చిందని ఆయన తెలిపారు. సూర్యను పరీక్షించిన వైద్యులు ఆయన పరిస్థితి బాగానే ఉందని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారని వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా తో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Surya
Kollywood
Tollywood
Injury
  • Loading...

More Telugu News