K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును తనిఖీ చేసిన అధికారులు

Police searches MLC kavitha car

  • ఆర్మూర్‌కు ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా కారును ఆపిన అధికారులు
  • ముబారక్ నగర్ వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు
  • తనిఖీలకు సహకరించినందుకు కవితకు థ్యాంక్స్ చెప్పిన పోలీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవిత ప్రయాణిస్తున్న కారును ముబారక్ నగర్ వద్ద తనిఖీ నిర్వహించారు. ఆమె ఆర్మూర్‌కు ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న సమయంలో ఆమె కారును అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఆమె కారు దిగి అధికారులకు పూర్తిగా సహకరించారు. కారును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలకు సహకరించినందుకు ఎమ్మెల్సీ కవితకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

K Kavitha
Telangana Assembly Election
BRS
  • Loading...

More Telugu News