Anushka Shetty: అనుష్క లాంటి హీరోయిన్ ఇప్పట్లో రాదు: 'పంచాక్షరి' నిర్మాత

Ramachandra Rao Interview

  • 'పంచాక్షరి' గురించి ప్రస్తావించిన నిర్మాత
  • అనుష్క వ్యక్తిత్వం గొప్పదని కితాబు
  • దానగుణం ఎక్కువని వెల్లడి  
  • ఆమె వలన ఇబ్బందిపడిన నిర్మాత లేడని వ్యాఖ్య


అనుష్క ప్రధానమైన పాత్రగా 'పంచాక్షరి' సినిమా తెరకెక్కింది. సముద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, బొమ్మదేవర రామచంద్రరావు నిర్మాతగా వ్యవహరించారు. 13 ఏళ్ల గ్యాప్ తరువాత ఆయన 'మాధవే మధుసూదన' సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక హీరోగా చేసింది ఆయన తనయుడు తేజ.

ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో రామచంద్రరావు బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో 'పంచాక్షరి' సినిమా .. అనుష్క గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన స్పందిస్తూ .. " అనుష్క  చాలా సెన్సిటివ్. ఎదుటి వ్యక్తి బాధపడితే .. ఆ కష్టం తనకి వచ్చినట్టుగా తను బాధపడుతుంది. కుక్కపిల్ల బాధపడినా తను తట్టుకోలేదు" అన్నారు. 

"నిర్మాతగా అనుష్కతో 'పంచాక్షరి' తీశాను. అడ్వాన్స్ గా నేను ఆమెకి ఇచ్చింది చాలా తక్కువ మొత్తం .. అయినా సినిమా విడుదలయ్యేవరకూ కూడా నన్ను డబ్బు అడగలేదు. అసలు ఆమె ఇబ్బంది పెట్టిందని ఎవరూ చెప్పుకోగా నేను వినలేదు. అలాగని ఆమె అమాయకురాలేం కాదు. చూడగానే ఎవరు ఎలాంటివారు అనేది గ్రహించేస్తుంది. నటన పరంగా చూసినా ... వ్యక్తిత్వం పరంగా చూసినా .. గ్లామర్ పరంగా చూసినా అలాంటి హీరోయిన్ ఇప్పట్లో రాదు" అని చెప్పారు.

Anushka Shetty
Ramachandra Rao
Panchakshari
Tollywood
Film News
  • Loading...

More Telugu News