Raja: 'గోదావరి' సినిమా నేను చేయవలసింది: 'ఆనంద్' హీరో రాజా

Raja Interview

  • 'ఆనంద్'తో క్రేజ్ తెచ్చుకున్న రాజా 
  • తాను హీరోనని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్య 
  • ఇండస్ట్రీలో చాలామందికి సాయం చేశానని వెల్లడి 
  • డబ్బు కోసం పరిగెత్తే పరిస్థితి లేదని వివరణ


హీరో రాజా సినిమా ఇండస్ట్రీకి దూరమై చాలాకాలమైంది. రాజా అంటే చాలామందికి వెంటనే తట్టదు. అదే 'ఆనంద్' హీరో అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను ఎప్పుడూ కూడా ఒక హీరోను అన్నట్టుగా లేను. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాను .. మాట్లాడతాను" అన్నాడు.  

"నా పిల్లల పిల్లలకు కూడా సరిపోయేంత డబ్బు నాకు భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడే నేను చాలామందికి ఆర్ధిక సాయం చేశాను. కానీ నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు.  నిజం చెప్పాలంటే మూడు పూటలా తినే అవకాశం ఉన్నవాళ్లంతా ధనవంతులే" అని చెప్పాడు. 

'శేఖర్ కమ్ములగారు చేసిన 'ఆనంద్' సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 'గోదావరి' కథను కూడా ముందుగా ఆయన నాకే చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన నేను ఆ సినిమా చేయలేకపోయాను. చెన్నై ఎయిర్ పోర్టులో ఒక పెద్ద మనిషి ఆ సినిమా చేయనందుకు నన్ను తిట్టాడు కూడా" అని అన్నాడు.

Raja
Actor
Anand Movie
Tollywood
  • Loading...

More Telugu News