Keerthy Suresh: క్రికెట్ ప్రచారంలో కీర్తి సురేశ్... ఫొటోలు ఇవిగో!

Keerthy Suresh inaugurates cricket sales for 2nd T20 between Team India and Australia will be held at Tiruvanathapuram

  • కేరళ క్రికెట్ సంఘం బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తి సురేశ్
  • ఈ నెల 26న తిరువనంతపురంలో టీమిండియా-ఆసీస్ టీ20
  • టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన కీర్తి సురేశ్
  • కేరళ మహిళా క్రికెటర్లతో చిట్ చాట్ 

దక్షిణాది బ్యూటీ కీర్తి సురేశ్ కొత్త అవతారం ఎత్తారు. ఇప్పుడామె క్రికెట్ ప్రచారకర్తగా మారారు. కీర్తి సురేశ్ కేరళ క్రికెట్ సంఘం తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 26న జరిగే రెండో టీ20 మ్యాచ్ కు కీర్తి సురేశ్ టికెట్ల అమ్మకాలను ప్రారంభించారు. ఈ మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. 

టికెట్ల అమ్మకాల ప్రారంభం సందర్భంగా కీర్తి సురేశ్ కేరళ మహిళా క్రికెటర్లతో ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. భవిష్యత్ మహిళా క్రికెట్ తారలు వీళ్లేనంటూ కొనియాడారు. ఇటువంటి ప్రతిభావంతులైన, హుషారైన మహిళా క్రికెటర్లను కలుసుకోవడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని కీర్తి సురేశ్ తెలిపారు. కేరళ గర్వించదగ్గ క్రికెటర్ మిన్ను మణితో ముచ్చటించానని వెల్లడించారు. 

త్వరలో జరిగే టీమిండియా-ఆసీస్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభించడం ఆనందదాయకం అని వివరించారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తుండడం తనకు దక్కిన విశేష గౌరవంగా భావిస్తానని కీర్తి సురేశ్ పేర్కొన్నారు.

More Telugu News