GVL Narasimha Rao: జనసేనతో పొత్తుపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

GVL narasimha rao about janasena bjp alliance

  • పొత్తుపై తమ పార్టీకి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు
  • ఎన్నికలు సమీపించేకొద్దీ పొత్తుపై క్లారిటీ వస్తుందని వ్యాఖ్య
  • ఇతర పార్టీలను కలుపుకునే విషయమై భవిష్యత్తులో చర్చిస్తామని వెల్లడి

ఏపీలో జనసేనతో తమ పార్టీ పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రెండు పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇతర పార్టీలను కూడా కలుపుకు పోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తామన్నారు. 

‘‘జనసేనతో పొత్తుపై మాకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్ నుంచి మా పార్టీ బలోపేతం అవడానికి  పని చేస్తుంది. ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికే నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉంది.

‘‘ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తోంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిస్టులు దిక్కు తోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు దాదాపుగా కనుమరుగయ్యారు. తెలంగాణలో ఒకటో రెండో సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్ల కోసం కమ్యూనిస్టులు ఇలా మాట్లాడుతున్నారు’’ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

GVL Narasimha Rao
BJP
Janasena
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News