Congress: కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియోను షేర్ చేసిన కాంగ్రెస్!

Telangana Congress shares video of KTR phone call
  • బీఆర్ఎస్ సొంత కేడర్ ప్రచారానికి జంకుతోందంటూ ఎద్దేవా
  • ప్రచారం కోసం కేడర్‌నే బతిమాలుకునే దుస్థితిలో బీఆర్ఎస్ అంటూ కామెంట్
  • సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయమని వ్యాఖ్య
తెలంగాణ ఎన్నికలు  సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలకు పదును పెంచుతున్నాయి. తాజాగా కాంగ్రెస్.. కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియోను నెట్టింట పంచుకుంది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే కేడర్ ప్రచారానికి పోవాలంటే వెనకాడుతోందని కామెంట్ చేసింది. నాయకులకు ఫోన్లు చేసి బ్రతిమలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని ఎద్దేవా చేసింది. సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని కామెంట్ చేసింది.  

కేటీఆర్ ఫోన్ కాల్‌గా కాంగ్రెస్ చెబుతున్న ఆడియోలో మంత్రి..సిరిసిల్ల స్థానిక నాయకులను ఎన్నికల ప్రచారం గురించి అప్రమత్తం చేశారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని హెచ్చరించారు. ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో.. ఏ బూత్ వాళ్లు ఆ పరిధిలో పటిష్ఠంగా ఇంటింటా ప్రచారం చేయాలని మంత్రి చెప్పినట్టు ఆడియోలో వినిపించింది. రాబోయే వారం రోజులు సిరిసిల్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచిస్తున్నట్టు ఆడియోలో ఉంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీలు, అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పదిమంది పది రకాలుగా మాట్లాడటం బంద్ చేయాలని హెచ్చరించారు. మెజార్టీ తగ్గుతుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్టు ఉన్న వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది.
Congress
Telangana
KTR
Rajanna Sircilla District
BRS

More Telugu News