Pawan Kalyan: ఎక్కువ నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నాను..: పవన్ కల్యాణ్

Pawan Kalyan talking about his campaign in Telangana

  • సమయాభావం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నానన్న పవన్ కల్యాణ్
  • బీజేపీ, జనసేన పరస్పరం సహకారంతో ముందుకు సాగాలని సూచన
  • బీజేపీ అభ్యర్థులు ఉన్నచోట జనసేన శ్రేణులు, జనసేన అభ్యర్థులకు బీజేపీ మద్దతుగా నిలబడాలని పిలుపు

తాను సమయాభావం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నానని, అయితే బీజేపీ, జనసేన పరస్పరం సహకారంతో ముందుకు సాగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమయాభావం వల్ల తాను ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ జనసేన శ్రేణులు, అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కాగా పవన్ కల్యాణ్ రేపు కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News