Congress: కేటీఆర్ ప్రచార తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ

Congress Party complaints against Minister KTR

  • ప్రభుత్వ భవనాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు 
  • తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపణలు 
  • మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం ఉల్లంఘనే అన్న కాంగ్రెస్

మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన ప్రచార తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాల్లో, ఇంటర్వ్యూలలో, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ప్రభుత్వ భవనమైన టీ హబ్‌లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీ హబ్‌లో సమావేశంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన కాంగ్రెస్ బృందం పేర్కొంది.

  • Loading...

More Telugu News