Bigg Boss: రతిక .. నీ ఇష్టమొచ్చింది చేసుకో: 'బిగ్ బాస్' హౌస్ లో అమర్ ఫైర్

Bigg Boss 7 Update

  • రతికను నామినేట్ చేసిన అమర్ 
  • అతని రీజన్ పట్ల రతిక అసంతృప్తి  
  • ప్లేయర్ కి ఉండవలసిన లక్షణం అదికాదంటూ అసహనం 
  • ఆమెపై మండిపడిన అమర్   


బిగ్ బాస్ హౌస్ లో నిన్న 78వ రోజున నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. రతికను అమర్ నామినేట్ చేయగా, ఆమె కూడా అతనిని నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కాస్త గట్టిగానే వాదనలు జరిగాయి. ఇద్దరూ కూడా తమ నామినేషన్ కి రీజన్ సరైనది కాదంటూ వాదించుకున్నారు.

తన ఆటతీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన అమర్ పట్ల రతిక అసహనాన్ని ప్రదర్శించింది. ఒక దశ తరువాత గేమ్ లో మునిగిపోవడం వలన, తాను నోరు జారి ఉంటానని అమర్ అన్నాడు. ఎంత గేమ్ లో మునిగిపోయినా, ఒక ప్లేయర్ కి ఉండవలసిన లక్షణం అదికాదు అంటూ అతని తీరును తప్పుబట్టింది. ఈ సమయంలోనే అమర్ ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యాడు.

"అందరితో మాట్లాడినట్టుగా తనతో మాట్లాడటానికి ట్రై చేయవద్దు. నీకు నచ్చినా నచ్చకపోయినా నా పద్ధతి ఇలాగే ఉంటుంది. నీ ఇష్టం వచ్చినన్నిసార్లు నామినేట్ చేసుకో. నా ఆట అదే .. నా వేట అదే. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను అదే కోపంతో ఆడతాను .. అదే కసితో ఆడతాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు" అంటూ మండిపడ్డాడు.

Bigg Boss
Amar
Rathika
Prashanth
Gautham
  • Loading...

More Telugu News