‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన విరాట్ కోహ్లీ
- 90.31 సగటుతో వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విరాట్
- 11 మ్యాచ్‌ల్లో మొత్తం 765 పరుగులు కొట్టిన పరుగుల యంత్రం
- టోర్నీలో మొత్తం 3 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ
విరాట్‌ని ఓదార్చిన అనుష్క శర్మ
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వడం పట్ల భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీళ్లతో కనిపించారు. సహచర క్రికెటర్లు వీరిని ఓదార్చారు. కింగ్ విరాట్ కోహ్లీని భార్య అనుష్క శర్మ ఓదార్చింది. అప్యాయంగా హత్తుకొని ధైర్యం చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.