Hyderabad: హైదరాబాద్ లో 6.5 కోట్ల నగదు పట్టివేత

7 Cr cash seized in Hyderabad

  • ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున పట్టుబడుతున్న డబ్బు
  • అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో నగదు పట్టివేత
  • ఖమ్మం జిల్లా నాయకుడిదిగా అనుమానం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ వద్ద ఏకంగా రూ. 6.5 కోట్ల డబ్బు పట్టుబడింది. ఆరు కార్లలో ఈ నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడిది అని అనుమానిస్తున్నారు. నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad
Cash
  • Loading...

More Telugu News