Ch Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట

Minister Malla Reddy gets relief in TS High Court
  • మల్లారెడ్డి ఎన్నికల అపిడవిట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
  • నామినేషన్ తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్
  • పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని... ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషనర్ అంజిరెడ్డి కోర్టును కోరారు. అయితే మల్లారెడ్డి అఫిడవిట్ పై అంజరెడ్డికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

Ch Malla Reddy
BRS
TS High Court

More Telugu News