Revanth Reddy: తెలంగాణలో జనసేనకు తక్కువ ఓట్లు వస్తే ఆ ప్రభావం ఏపీపై ఉంటుంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy opines on political developments

  • చంద్రబాబు అరెస్ట్ కరెక్టా, కాదా అనేది చర్చించబోనని స్పష్టీకరణ
  • చంద్రబాబు జైలుకు వెళ్లడం వ్యక్తిగతంగా బాధ కలిగించిందని వివరణ
  • చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారన్న రేవంత్ 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ టీవీ చానల్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీలో ఉందని అన్నారు. అయితే తెలంగాణలో జనసేన పార్టీకి తక్కువ ఓట్లు వస్తే ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపైనా ఉంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇక, చంద్రబాబు అరెస్టయి జైలుకు వెళ్లడం కరెక్టా, కాదా అనే విషయాన్ని చర్చించబోనని అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం మాత్రం వ్యక్తిగతంగా తనకు బాధ కలిగించిందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ కాంగ్రెస్ పార్టీ ఖండించిందని రేవంత్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ ను లాభనష్టాల దృష్టితో చూడడం లేదని స్పష్టం చేశారు. 

కాగా, చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆందోళనలు చేయొద్దంటూ బెదిరించారని ఆరోపించారు. ఆంధ్రా వాళ్లను సెటిలర్స్ అంటూ వేరు చేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కేటీఆర్ మాటలు బీఆర్ఎస్ వారికే నష్టం కలిగిస్తాయని అన్నారు.

Revanth Reddy
Janasena
Chandrababu
AP Politics
Congress
Telangana
Telangana Assembly Results
  • Loading...

More Telugu News