Chaitanya Rao: లవ్ ఎఫైర్స్ ఉన్నాయి .. కానీ డబ్బు లేకపోతే ఏదీ వర్కౌట్ కాదు: హీరో చైతన్యరావు

Chaitanya Rao Interview

  • నటుడిగా బిజీ అవుతున్న చైతన్యరావు 
  • తన మార్కు చూపిస్తూ వెళుతున్న నటుడు 
  • లగ్జరీ లైఫ్ కి ఛాన్స్ లేదని వెల్లడి 
  • సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ ఉందని వ్యాఖ్య 


చైతన్యరావు గురించి ఇప్పటి యూత్ కి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వైపున వెబ్ సిరీస్ లు .. మరో వైపున సినిమాలు చేస్తూ ఆయన తన ఇమేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. రీసెంటుగా ఆయన నుంచి 'కీడా కోలా' సినిమా పలకరించింది.  

తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ మేటర్ ప్రస్తావనకు వచ్చింది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నాకు చాలా లవ్ ఎఫైర్స్ ఉన్నాయి .. లేవని చెబితే అది ఏదో ఫార్మల్ గా చెప్పినట్టు అవుతుంది. అయితే లవ్ ను ఎంజాయ్ చేసే లగ్జరీకి అవకాశం ఉండేది కాదు. ఫైనాన్షియల్ పొజీషన్ అందుకు కారణమని చెప్పాలి" అన్నారు. 

"లవ్ లో పడిన తరువాత సరదాగా ఏ రెస్టారెంట్ కో వెళ్లవలసి వస్తుంది. 10 సార్లు అవతలవాళ్లు బిల్ కడితే, 11వ సారి అయినా మనం ఇవ్వాలి కదా .. కానీ అలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇక ఎప్పుడూ నా ఆలోచనలు సినిమాల చుట్టూనే తిరుగుతూ ఉండేవి.  సినిమా వాళ్లతోనే తిరుగుతూ ఉండేవాడిని. అందువలన ఫోన్స్ కూడా రిసీవ్ చేసుకునేవాడిని కాదు. అందువలన కొంతమంది అమ్మాయిలు సైడై పోయేవారు. అనుకుంటాంగానీ డబ్బు లేకపోతే ఏదీ వర్కౌట్ కాదు" అని చెప్పారు. 


Chaitanya Rao
Actor
Tollywood
  • Loading...

More Telugu News