Balakrishna: బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్త

YSRCP karyakarta tried to stop Balakrishna car

  • బాలయ్య హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత
  • కారుపై ప్లకార్డు విసిరేందుకు యత్నించిన వైసీపీ కార్యకర్త
  • ప్లకార్డుకు ఉన్న కర్ర ఎస్సైకి తగిలిన వైనం

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత అశ్వర్థరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్య... తిరిగి ఇంటికి వెళ్తుండగా మధు అనే వైసీపీ కార్యకర్త ఆయన కారును అడ్డుకున్నారు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో వాహనాన్ని అడ్డుకోబోయాడు. కారు పైకి ప్లకార్డును విసిరే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు మధును అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్లకార్డుకు ఉన్న కర్ర ఎస్సైకి తగిలింది. మధును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా... అతను అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం అక్కడి నుంచి బాలయ్య కాన్వాయ్ బయల్దేరింది.

Balakrishna
Telugudesam
Hindupuram
YSRCP
  • Loading...

More Telugu News