War 2: 'వార్ 2'లో ఎన్టీఆర్ జోడీ కట్టే బ్యూటీ గురించే హాట్ టాపిక్!

- గతంలో హిట్ కొట్టిన 'వార్' సినిమా
- ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న 'వార్ 2'
- 'దేవర' తరువాత జాయిన్ కానున్న ఎన్టీఆర్
- కథానాయికలుగా తెరపైకి అలియా - కియారా పేర్లు
ఒక వైపున ఎన్టీఆర్ 'దేవర' సినిమాలోని ప్రత్యేకతలు .. విశేషాలు తెలుసుకుంటూ ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మరో వైపున 'వార్ 2' సినిమాకి సంబంధించిన వార్తలు కూడా వాళ్లలో మరింత జోష్ పెంచుతున్నాయి. 'వార్ 2' షూటింగు కోసం ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడని అంటున్నారు.
గతంలో హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 150 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 475 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'వార్ 2' రూపొందుతోంది. హృతిక్ రోషన్ పై కొన్ని కీలకమైన సీన్స్ ను అయాన్ ముఖర్జీ చిత్రీకరిస్తున్నాడు. 'దేవర' తరువాత ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయినవుతాడని అంటున్నారు.
