India: ముగిసిన భారత ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం!

Indias scores 397 sets huge target for newzealand
  • 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 397/4
  • సెంచరీలతో మెరిసిన కోహ్లీ(117), శ్రేయాస్(105)
  • రాణించిన రోహిత్(47), గిల్(80 నాటౌట్)
న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న సెమీస్‌లో భారత్ దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లపై ఆది నుంచి పైచేయి సాధించారు. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసి న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్ నెలకొల్పింది.     

వన్డేల్లో 50వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ సచిన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి, కొత్త చరిత్ర లిఖించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 105 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ(47), శుభ్‌మన్ గిల్ (80 నాటౌట్) కూడా రాణించడంతో భారత్ భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌధీ మూడు వికెట్లు పడకొట్టి 100 పరుగులు ఇచ్చుకోగా, ట్రెంట్ ఒక వికెట్ తీశాడు.
India
Team New Zealand
Crime News

More Telugu News