Subhman Gill: భారీ స్కోరు దిశగా టీమిండియా.. శుభ్ మన్ గిల్ రిటైర్డ్ హర్ట్

Subhman Gill retired hurt

  • 27 ఓవర్లలో 194 పరుగులు చేసిన టీమిండియా
  • 50 పరుగులతో క్రీజ్ లో ఉన్న కోహ్లీ
  • 79 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన గిల్

వన్డే వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్స్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. న్యూజిలాండ్ బౌలర్లను మన బ్యాట్స్ మెన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 194 పరుగులు. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ భారత్ కు శుభారంభాన్ని ఇచ్చారు. 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ 47 పరుగులకు ఔట్ కాగా శుభ్ మన్ గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. క్రాంప్ కారణంగా గిల్ మైదానాన్ని వీడాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 50, శ్రేయస్ అయ్యర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుత రన్ రేట్ కొనసాగితే టీమిండియా 390 పరుగులు చేసే అవకాశం ఉంది.

Subhman Gill
Team India
Retired Hurt
  • Loading...

More Telugu News