అల్యూమినియం ఫ్యాక్టరీకి చేరుకున్న 'దేవర'
- షూటింగు దశలో ఉన్న ఎన్టీఆర్ 'దేవర'
- అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు వారాల షూటింగు
- ప్రధాన పాత్రల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ
- ఏప్రిల్ 5వ తేదీన మొదటి భాగం విడుదల
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదు .. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ ప్లాన్ చేశారు. రెండు వారాల పాటు ఇక్కడే చిత్రీకరణ కొనసాగుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు.
ఆ తరువాత షెడ్యుల్ లో పాటలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. సైఫ్ అలీ ఖాన్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.