TTD: తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం... కీలక నిర్ణయాల వివరాలు ఇవిగో!

TTD board held meeting in Tirumala

  • అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
  • అలిపిరి గోశాల వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం
  • టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం
  • నడకదారుల్లో భక్తుల భద్రత కోసం రూ.3.5 కోట్లు మంజూరు

టీటీడీ ధర్మకర్తల మండలి నేడు తిరుమలలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. 

టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.6,850 ఇవ్వనున్నారు. పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వ చేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్లు మంజూరు చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. 

తిరుమల నడకదారుల్లో వన్యమృగాల నుంచి భక్తుల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భద్రతా పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది.

  • Loading...

More Telugu News