TDP: టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు

CID issues notice to TDP Head Office

  • స్కిల్ కేసులో సీఐడీ దర్యాప్తు
  • టీడీపీ ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాల వివరాలు కావాలంటూ నోటీసులు
  • ఈ నెల 18 లోపు ఖాతాల వివరాలు అందజేయాలని స్పష్టీకరణ

ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ సీఐడీ కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టీడీపీ బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18 లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడీ తన నోటీసుల్లో తెలిపింది. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ... అందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

స్కిల్ నిధులు టీడీపీ ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది. వివిధ షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి రూ.27 కోట్లు వచ్చినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపారు.

More Telugu News