Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ సోదరి కన్నుమూత!

US Ex President Donald Trump sister passes away

  • ట్రంప్ సోదరి మేరియన్ ట్రంప్ బ్యారీ కన్నుమూత
  • యూఎస్ ఫెడరల్ జడ్జిగా పని చేసి రిటైరైన మేరియన్
  • తమ్ముడు ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరి మేరియన్ ట్రంప్ బ్యారీ మృతి చెందారు. ఆమె వయసు 86 ఏళ్లు. యూఎస్ ఫెడరల్ జడ్జిగా పని చేసి ఆమె రిటైర్ అయ్యారు. సోమవారం తెల్లవారుజామున న్యూయార్క్ లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్టు గార్డియన్ పత్రిక తెలిపింది. 1974లో అసిస్టెంట్ అటార్నీగా ఆమె తన కెరీర్ ను ప్రారంభించారు. తమ్ముడు డొనాల్డ్ ట్రంప్ తో ఆమె చాలా సన్నిహితంగా ఉండేవారు. గత ఏడాది ట్రంప్ సోదరుడు రాబర్డ్ ట్రంప్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

Donald Trump
USA
Sister
  • Loading...

More Telugu News