Breathe: సస్పెన్స్ థ్రిల్లర్ గా 'బ్రీత్' .. ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్!

Breathe trailer released

  • హీరోగా చైతన్యకృష్ణ రీ ఎంట్రీ 
  • రిలీజ్ కి రెడీగా అవుతున్న 'బ్రీత్'
  • ఆసక్తిని రేపుతున్న ట్రైలర్ 
  • దర్శకుడిగా వంశీకృష్ణ ఆకెళ్ల    


నందమూరి చైతన్యకృష్ణ హీరోగా 'బ్రీత్' సినిమా రూపొందింది. గతంలోనే ఎంట్రీ ఇచ్చిన చైతన్య కృష్ణ, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ఇది. నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో గాయాల పాలైన పేషంట్ గా కనిపిస్తూ, హాస్పిటల్లోనే హత్య చేయడాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. హాస్పిటల్ నేపథ్యంలోనే కథ ఎక్కువగా నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

గతంలో వంశీకృష్ణ ఆకెళ్ల 'ది ట్రిప్' .. 'రక్షా' అనే సినిమాలను తెరకెక్కించాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన రూపొందించిన 'బ్రీత్' ఇప్పుడు విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి చైతన్యకృష్ణ ఇక వరుస సినిమాలు చేస్తాడేమో చూడాలి. 

More Telugu News