ODI World Cup: వరల్డ్ కప్ సెమీఫైనల్స్.. మ్యాచ్ లు ఏయే జట్ల మధ్య ఎక్కడ జరగనున్నాయంటే..!

Semi finalists in ODI WC

  • సెమీస్ కు చేరిన ఇండియా, సౌతాఫ్రికా, ఆసీస్, కివీస్
  • తొలి సెమీస్ లో తలపడనున్న ఇండియా - న్యూజిలాండ్
  • ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా మధ్య రెండో సెమీస్

2023 వన్డే వరల్డ్ కప్ లో తొలి అంకం ముగిసింది. లీగ్ దశ ముగిసి... నాకౌట్ స్టేజ్ లోకి టోర్నీ అడుగుపెట్టింది. ఆడిన అన్ని మ్యాచ్ లు గెలిచి టీమిండియా సెమీస్ లో అడుగు పెట్టగా... ఎన్నో సంచలన ఫలితాల మధ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాయి. 15వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీస్ లో ఇండియాతో న్యూజిలాండ్ తలపడుతుంది. 16వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగే రెండో సెమీస్ లో సౌతాఫ్రికాను ఆస్ట్రేలియా ఢీకొంటుంది. 19వ తేదీన (ఆదివారం) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. బలమైన జట్లు సెమీస్ కు చేరడంతో... ఫైనల్స్ కు ఎవరెవరు చేరుతారా అనే ఉత్కంఠ నెలకొంది. 

ODI World Cup
Semi Finals
  • Loading...

More Telugu News