Srisailam: శ్రీశైలం సమీపంలో వాహనం ఢీకొని చిరుత మృతి

Leopard dead near Srisailam

  • శ్రీశైలం దేవాలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఘటన
  • రాత్రి 8 గంటల సమయంలో చిరుత రోడ్డు దాటుతుండగా ప్రమాదం
  • శ్రీశైలం వైపు వెళ్లే వాహనం ఢీకొట్టి ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు

నంద్యాల జిల్లా శ్రీశైల పుణ్యక్షేత్రానికి సమీపంలో శుక్రవారం ఓ చిరుత మృతి చెందింది. పుణ్యక్షేత్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో చిరుత రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. పాలధార, పంచధార సమీపంలోని రహదారిపై రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత కళేబరాన్ని సున్నిపెంట అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. మృతి చెందినది ఆడ చిరుత అని, దాని వయసు సుమారు ఆరు నెలలు ఉంటుందని తెలిపారు. శ్రీశైలం వైపు వెళ్లే వాహనం ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు నిత్యం సంచరిస్తుంటాయి. రాత్రి వేళల్లో రోడ్లు దాటుతూ పలుమార్లు స్థానికులు, వాహనదారుల కంటపడ్డాయి.

Srisailam
Leopard
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News