KTR: కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Minister KTR fires at Congress minorty declaration

  • మైనార్టీలను బీసీల్లో చేర్చితే ఇటు బీసీలకు, అటు మైనార్టీలకు నష్టమన్న కేటీఆర్
  • మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపణ
  • ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చుపెట్టే ప్రయత్నం

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలను బీసీల్లో చేర్చుతామని పేర్కొన్నారని, దీంతో ఇటు బీసీలకు, అటు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... మైనార్టీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు. ఈ మైనార్టీ డిక్లరేషన్‌ లోపభూయిష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ బీజేపీ ఐడియాలజీతో మైనార్టీ డిక్లరేషన్‌ ఇచ్చినట్టుగా ఉందన్నారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌‌కు తప్పుడు వాగ్దానాలు చేయడం కోత్తేమీ కాదని, గతంలోనూ చాలాసార్లు ఇలా చేసిందన్నారు.

ముస్లిం మైనార్టీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని, అలా చేస్తే మైనార్టీల ప్రత్యేక హోదా పోతుందన్నారు. మైనార్టీ డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నమని ధ్వజమెత్తారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనార్టీలని, కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యి ఆటలాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్‌ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మైనార్టీల కోసం ఏం చేసిందని నిలదీశారు. పదేళ్లలో కాంగ్రెస్‌ మైనార్టీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

  • Loading...

More Telugu News