Chinthamaneni Prabhakar: పోలవరం కుడి కాలువ వద్ద అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ... పలు వాహనాలను పట్టుకున్న చింతమనేని

Chinthamaneni protests at Pedavegi police station

  • పెదవేగి మండలంలో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారన్న చింతమనేని
  • ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించలేదంటూ స్వయంగా రంగంలోకి దిగిన టీడీపీ నేత
  • తాను పట్టుకున్న వాహనాలతో సహా పీఎస్ ముందు బైఠాయింపు
  • గత అర్ధరాత్రి నుంచి పీఎస్ ఎదుట చింతమనేని నిరసన

ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో వైసీపీ నేతలు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అధికారులకు చింతమనేని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించలేదంటూ ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. 

గత అర్ధరాత్రి వేళ పోలవరం కుడి కాలువ వద్ద పలు వాహనాలను పట్టుకున్నారు. చింతమనేని 10 లారీలను, 2 జేసీబీలను, 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. తాను పట్టుకున్న వాహనాలతో సహా పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు కదలబోనని చింతమనేని నిరసనకు దిగారు. గత అర్ధరాత్రి నుంచి ఆయన పోలీస్ స్టేషన్ వద్దే నిరసన తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News