K Kavitha: టేక్ కేర్ రామన్నా...: కేటీఆర్ వాహనంపై నుంచి కిందపడిన ఘటనపై సోదరి కవిత

Kavitha Kalvakuntla Reacts to KTR falling incident

  • కేటీఆర్‌తో మాట్లాడినట్లు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
  • వీడియో చూస్తే భయానకంగా ఉందన్న బీఆర్ఎస్ నాయకురాలు
  • కేటీఆర్ ఎప్పటిలాగే రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం కొనసాగిస్తాడని వ్యాఖ్య

ఆర్మూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ప్రచారరథంపై నుంచి కేటీఆర్ కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడానని, ప్రచారరథం రెయిలింగ్ విరిగి... వారు కిందపడిన వీడియో చూస్తే భయానకంగా ఉందని పేర్కొన్నారు. తాను క్షేమంగానే ఉన్నట్లు తనతో పాటు కార్యకర్తలందరికీ చెప్పాడన్నారు. కేటీఆర్ ఎప్పటిలాగే రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని కొనసాగిస్తాడన్నారు. టేక్ కేర్ రామన్నా... ఈ ఎన్నికల్లో గెలుద్దాం అని ట్వీట్ ముగించారు.

కాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో  ఎన్నికల ప్రచార వాహనం రెయిలింగ్ కూలి బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి జీవన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి తదితరులు వాహనం పైనుంచి కిందపడ్డారు. దీంతో కేటీఆర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News