Katrina Kaif: రష్మికే కాదు... కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే!

Katrina Kaif also deepfake victim

  • ఇటీవల తీవ్ర కలకలం రేపిన రష్మిక డీప్ ఫేక్ వీడియో
  • తాజాగా సోషల్ మీడియాలో కత్రినా డీప్ ఫేక్ దృశ్యాలు
  • టైగర్-3 చిత్రంలో టవల్ కట్టుకుని ఫైట్ చేసిన కత్రినా 
  • టవల్ స్థానంలో లో దుస్తులతో డీప్ ఫేక్ ఫొటోలు

ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోనే దర్శనమిస్తోంది. దీనిపై రేగిన కలకలం సద్దుమణగక ముందే కత్రినా కైఫ్ కు చెందిన డీప్ ఫేక్ దృశ్యాలు తెరపైకి వచ్చాయి. కత్రినా... సల్మాన్ ఖాన్ టైగర్-3 చిత్రంలో ఓ ఫైట్ సీక్వెన్స్ లో టవల్ కట్టుకుని నటించింది. ఓ హాలీవుడ్ స్టంట్ ఉమన్ తో కత్రినా పోరాట దృశ్యాలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇది ఒరిజినల్ కాగా... డీప్ ఫేక్ ఫొటోల్లో ఆమె లో దుస్తుల్లో ఉన్నట్టు చూపించారు. ఇప్పుడు ఒరిజనల్ కంటే డీప్ ఫేక్ దృశ్యాలతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More Telugu News