Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడికి నోటీసులు పంపిన కోల్ కతా పోలీసులు

Kolkata police send notice to BCCI President Roger Binny

  • నేడు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్
  • టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్
  • బ్లాక్ లో టికెట్లు అమ్మారంటూ పోలీసులకు ఫిర్యాదులు
  • 19 మందిని అరెస్ట్ చేసిన కోల్ కతా పోలీసులు
  • టికెట్ల అమ్మకం వివరాలు తెలపాలంటూ బీసీసీఐ చీఫ్ కు నోటీసులు

ఇటీవల కాలంలో భారత్ లో క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు కొన్నిసార్లు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న టీమిండియా-దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్మారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఈ మెగా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లకు స్టేడియాలు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ టికెట్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టికెట్లను బ్లాక్ లో అమ్మారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 

రంగంలోకి దిగిన పోలీసులు 7 కేసులు నమోదు చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. 108 మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, కోల్ కతా పోలీసులు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి నోటీసులు పంపారు. టికెట్ల అమ్మకం వివరాలను సమర్పించాలని స్పష్టం చేశారు.

More Telugu News