Congress: తెలంగాణను గెలుద్దామంటూ రేవంత్ రెడ్డి ట్వీట్

Congress Party Telangana Chief Revanth Reddy Tweet
  • 6న నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడి
  • కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న పీసీసీ చీఫ్
  • డిసెంబర్ 3న కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్
తెలంగాణను గెలుచుకుందామంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 6న (సోమవారం) నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ ఓటర్లు రెడీగా ఉన్నారని, డిసెంబర్ 3న కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్ అవుతుందని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈమేరకు కాంగ్రెస్ జెండా చేతిలో పట్టుకుని ఉన్న ఫొటోను రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ కు జతచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పది గంటలకు కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Congress
Revanth Reddy
Telangana
Revanth nomination
kodangal
Congress victory
TPCC

More Telugu News