Ponnala Lakshmaiah: అందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

Ponnala Laxmaiah reveals why he was joined brs

  • తాను పదవుల కోసమో.. అధికారం కోసమే బీఆర్ఎస్‌లో చేరలేదన్న పొన్నాల
  • తనను ఎవరైనా ఏమైనా అంటే అది వారి మూర్ఖత్వమే అవుతుందన్న మాజీ మంత్రి
  • తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం

తాను పదవుల కోసమో... అధికారం కోసమో... కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరలేదని, కేవలం ఆత్మగౌరవం కోసం మాత్రమే చేరానని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తనను ఎవరైనా ఏమైనా అంటే అది వారి మూర్ఖత్వమే అవుతుందన్నారు. జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదని, అవగాహన లేదని, ఆలోచన లేదన్నారు. అహంకారంతో చేసే పని వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమయిందన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తోందన్నారు. కేసీఆర్ రావడం అవసరం, అవశ్యకత అన్నారు. 

ఇంకెప్పుడూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆలోచన తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీది స్వయంకృతాపరాధమే అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దూరమైందన్నారు. ప్రజల చెంతకు పాలన, ప్రజల చెంతకు డబ్బు చెందేలా కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారన్నారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా పని చేయాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలు కంటోందన్నారు. కానీ కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారన్నారు.

Ponnala Lakshmaiah
BRS
Congress
Telangana Assembly Election
  • Loading...

More Telugu News