Chandrababu: స్కిల్‌ కేసులో తీర్పు వెల్లడి.. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయన్న హైకోర్టు

AP High Court Quashed CID Petition On Chandrababu Skill Case

  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు
  • చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ
  • కుదరదని హైకోర్టు స్పష్టీకరణ
  • గతంలోని ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు వెల్లడి

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

చంద్రబాబు మధ్యంతర బెయిలులో ఇంకొన్ని అదనపు షరతులు విధించాలంటూ హైకోర్టులో సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన న్యాయస్థానం.. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అలాగే, రాజకీయ ర్యాలీల్లో పాల్గొనవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది.

More Telugu News