KCR: మార్చి తర్వాత ఆసరా పెన్షన్ రూ.5వేలు ఇస్తాం: కేసీఆర్ ప్రకటన

KCR says asara pension will be given rs 5000 after march

  • అబద్దపు హామీలు ఇచ్చేవారు ఎక్కువ అయ్యారన్న కేసీఆర్
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పేదల గురించి పట్టించుకోవని విమర్శ
  • కాంగ్రెస్ గెలిస్తే కనుక కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లేనని విమర్శ

మార్చి తర్వాత ఆసరా పెన్షన్ రు.5వేలు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ వేల్పూర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో మంచి సంప్రదాయం రావాలన్నారు. అబద్దపు హామీలు ఇచ్చేవారు ఎక్కువ అయ్యారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వైఖరి ప్రజలకు తెలుసునన్నారు. ఆ పార్టీలు రైతులు, పేదల గురించి పట్టించుకోవన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని, చర్చించి... ఆలోచించి ఓటేయాలన్నారు.

తెలంగాణ‌లో పొర‌పాటున‌ కాంగ్రెస్ గెలిస్తే మ‌ళ్లీ పైర‌వీకారులు పుట్టుకు వస్తారని, కైలాసం ఆట‌లో పెద్ద‌పాము మింగిన‌ట్టు అవుతుంద‌న్నారు. అల‌వోక‌గా, త‌మాషాగా ఓటు వేయొద్దన్నారు. అన్నీ ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎవ‌రు గెలిస్తే లాభ‌మో చూడాలన్నారు. నేను తెలంగాణ బిడ్డ‌గా చెప్తున్నా.. కాంగ్రెస్ వాళ్లకు రైతుబంధు ఇవ్వడం, క‌రెంట్ ఇవ్వడం, రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు వేయడం ఇష్టం లేదన్నారు. కాబట్టి ప్రజలంతా జాగ్ర‌త్తగా ఓటు వేయాలన్నారు. ఈ అభివృద్ధి కొన‌సాగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ధి నిల‌క‌డ‌గా ముందుకు సాగుతుందన్నారు.

  • Loading...

More Telugu News