Asaduddin Owaisi: రాహుల్ గాంధీ... ఆ సమయంలో మీరు మాకు ఎంత డబ్బిచ్చారు?: అసదుద్దీన్ చురకలు

Asaduddin satires on Rahul Gandhi

  • 2008లో అణుఒప్పందంలో యూపీఏకు మద్దతివ్వడానికి ఎంత ఇచ్చారు? అన్న అసదుద్దీన్
  • కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు మాకు ఎంత డబ్బు ముట్టజెప్పారు? అంటూ ప్రశ్న
  • రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు మద్దతిచ్చేందుకు మాకు ఎంతిచ్చారు? అంటూ అసద్ మరో ప్రశ్న

బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఒకటే అన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2008లో అణుఒప్పందంలో మీ యూపీఏ ప్రభుత్వానికి మద్దతివ్వడానికి అప్పుడు మీ నుంచి మేం ఎన్ని డబ్బులు తీసుకున్నామని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఏపీలో అవిశ్వాస తీర్మానం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు మాకు ఎంత డబ్బు వచ్చింది? అని నిలదీశారు. మీకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వడానికి అప్పుడు మాకు ఎంత డబ్బు ముట్టజెప్పారు? అని అసదుద్దీన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News