KCR: అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం
- తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన యాగం
- మూడు రోజుల పాటు కొనసాగనున్న యాగం
- విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో యాగం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటల బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభమయింది. 200 మంది వైదికులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు.
ఈరోజు రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు. రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి. చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. మరోవైపు ఈ యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తూనే వస్తున్నారు. ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని తలపెట్టారు. ఆయన ఫామ్ హౌస్ లో ఈ యాగం జరుగుతోంది.