Indigo Flight: హైదరాబాద్-మాల్దీవ్స్ మధ్య నేరుగా విమానాలు.. అందుబాటులోకి తెచ్చిన ఇండిగో

Indigo direct flight to Maldives from Hyderabad

  • మంగళ, గురు, శనివారాల్లో మాలెకు డైరెక్ట్ ఫ్లైట్స్
  • పునఃప్రారంభించిన ఇండిగో
  • ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరనున్న విమానం

మాల్దీవ్స్‌లో విహరించాలనుకునే ప్రయాణికులకు చౌకధరల విమానయాన సంస్థ ఇండిగో బ్రహ్మాండమైన కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు నిన్నటి నుంచి డైరెక్ట్ సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్-మాలె విమానం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. 

ఈ మూడు రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు మాలె చేరుకుంటుంది. గంట తర్వాత అంటే 1.25 గంటలు తిరిగి అక్కడ బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Indigo Flight
Maldives
Hyderabad
  • Loading...

More Telugu News