Galla Jayadev: చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలిసి మనసంతా ఆనందంతో నిండిపోయింది: గల్లా జయదేవ్

Jay Galla reacts after Chandrababu interim bail

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
  • రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
  • చంద్రబాబు త్వరలోనే ప్రజలతో మమేకం అవుతారని భావిస్తున్నామన్న గల్లా
  • త్వరలోనే చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఊరట కలుగుతుందని ఆశాభావం

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదల కావడం తెలిసిందే. చంద్రబాబుకు బెయిల్ పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. 

మన ప్రియతమ నేత చంద్రబాబు గారికి మధ్యంతర బెయిల్ వచ్చిందన్న విషయం తెలిసి మనసంతా ఆనందంతో నిండిపోయిందని అన్నారు. ఆయన త్వరలోనే ప్రజలతో మమేకం అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. అంతిమంగా గెలిచేది న్యాయమేనని తాను గట్టిగా నమ్ముతానని, త్వరలోనే చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఊరట లభిస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. 

చంద్రబాబు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొంది, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు గల్లా జయదేవ్ తెలిపారు.

Galla Jayadev
Chandrababu
Bail
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News