Revanth Reddy: మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు: యాపిల్ వార్నింగ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన రేవంత్ రెడ్డి

Revanth get alerts about their phones targeted by attackers

  • ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి
  • స్పైవేర్‌ని ఉపయోగించి తమ ఫోన్లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారని ఆరోపణ
  • ఏదీ తమను అడ్డుకోలేదని... చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతామని వెల్లడి

తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్పైవేర్‌ని ఉపయోగించి తమ ఫోన్‌లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారని, ఇది గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. కానీ ఏదీ తమను అడ్డుకోదన్నారు.

తమ చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏకైక ప్రాధాన్యత ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడడమే అన్నారు. తెలంగాణ ప్రజలకోసం రాజీ లేకుండా పోరాడుతున్నామని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నట్లుగా ఉందని యాపిల్ నుంచి తనకు వచ్చిన మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.

హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తన ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. తనకు గత రాత్రి అటాకర్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని ట్వీట్ చేశారు. తాను ఉదయం తన మెయిల్‌లోకి వెళ్లి, యాపిల్ నుంచి వచ్చిన సందేశాన్ని చూశానని తెలిపారు.

  • Loading...

More Telugu News